ఐ లవ్ ఇండియా

ఈ మట్టి వాసనలో
స్వేచ్ఛ కోసం కారిన రక్తపు తడి ఉంది…
ఈ గాలిలో
స్వాతంత్ర్య సమరయోధుల
అమర నినాదాల ప్రతిధ్వని ఉంది…
ఖడ్గం కన్నా బలమైన సంకల్పంతో
గుండెను కవచంగా చేసుకుని
యుద్ధ గాథలు రాసిన వారు వారు…
కారాగార గోడల మధ్య
కలల్ని చంపనివ్వని ధీరులు…
ఆకలి, బాధ, మరణం
అన్నింటినీ చిరునవ్వుతో ఎదుర్కొని
మనకోసం
మన రేపటికోసం
వారి ఈ రోజును త్యాగం చేశారు…
ఆ త్యాగాల ఫలితమే ఈ దేశం,
మన ఓటు, మన స్వరం,
మనకు మనమే పాలకులమనే గర్వం…
ప్రజాస్వామ్యం అనే దీపం
ప్రతి పౌరుని చేతిలో వెలిగింది…
స్వేచ్ఛ అంటే
ఇష్టం వచ్చినట్లు కాదు,
బాధ్యతతో జీవించడమని
ఈ గణతంత్రం మనకు నేర్పింది…
సమానత్వం, న్యాయం, సౌభ్రాతృత్వం
మన రాజ్యాంగపు శ్వాసలు…
ఇన్ని భాషలు, ఇన్ని మతాలు
కానీ ఒకే హృదయం…
విభిన్నతలో ఏకత్వం
మన భారతదేశపు అసలైన శక్తి…
ఈ గణతంత్ర దినోత్సవం నాడు
ఆ అమరుల్ని స్మరించుకుందాం…
వారి కలల భారతాన్ని
మన చేతులతో నిర్మిద్దాం…
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!
గర్వంగా చెప్పుకుందాం —
ఐ లవ్ ఇండియా.
— కంచర్ల సుబ్బానాయుడు
