
తొలి పూజ
వినాయకుడు…
గణేశుడు…
గణపతి…..
విఘ్నేశ్వరుడు….
ఇలా… ఏ పేరుతో పిలువబడిన తొలి పూజ అందుకొనే హిందూ దేవులలో బాగా ప్రసిద్ధి చెందిన, ఎక్కువగా ఆరాధించబడే దేవుడు.
ఏనుగు రూపంలో కనిపించే ఈ దేవుడు స్వరూపం భారతదేశంలోనే కాక, నేపాల్, శ్రీలంక, థాయ్ లాండ్, బాలి, బంగ్లాదేశ్ దేశాల్లోనూ, భారతీయులు ఎక్కువగా నివసించే ఫిజి, మారిషస్, ట్రినిడాడ్- టుబాగో లాంటి దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. హిందువుల్లో ప్రధానంగా ఐదురకాలైన పంచాయతన సాంప్రదాయం ఉన్నా, వాటితో సంబంధం లేకుండా అందరూ గణపతిని ఆరాధించడం కద్దు గణేశుడి పట్ల భక్తి జైన, బౌద్ధమతాల్లోకి కూడా విస్తృతంగా వ్యాపించింది. ] గణేశుని అనేక విశేషణాలతో వర్ణించినప్పటికీ ఏనుగు ముఖం వల్ల ఆయనను సులభంగా గుర్తించవచ్చు. గణేశుడిని ఆటంకాలను తొలగించేవాడిగా విఘ్నేశ్వరుడు. కళలకు, శాస్త్రాలకు అధిపతిగా, బుద్ధికి, జ్ఞానానికి ఆరాధ్యుడిగా భావించి పూజలు చేస్తుంటారు. పనులు ప్రారంభించేటపుడు కృతువుల్లో, పూజల్లో ప్రథమ పూజ గణపతికి చేస్తుంటారు. మానవ జీవితంలో విద్య ప్రారంభ సమయంలో చేసే అక్షరాభ్యాసంలో కూడా గణపతిని పూజిస్తారు. ఆయన పుట్టుక, లీలల గురించి అనేక పౌరాణిక గ్రంథాలు వివరిస్తూ ఉన్నాయి.
ఋగ్వేదంలోని 2.23.1 శ్లోకంలో బ్రాహ్మణస్పతిని వేద కాలపు గణపతిగా పరిగణిస్తారు. సా. శ 1వ శతాబ్దం నాటికే గణేశుడు ఒక ప్రత్యేకమైన దైవంగా అవతరించాడు ] కానీ సా.శ 4 నుంచి 5 వ శతాబ్దంలో గుప్తుల కాలం నాటికి వేదకాలంలోని, అంతకు ముందు కాలపు పూర్వగాముల లక్షణాలను సంతరించుకున్నాడు శైవ సాంప్రదాయం ప్రకారం గణపతి పునర్జీవితుడైన శివు పార్వతుల పుత్రుడే కానీ, గణపతి అన్ని హిందూ సంప్రదాయాల్లోనూ కనిపిస్తాడు. గణాపత్యంలో వినాయకుడు సర్వోత్కృష్టమైన దేవుడు.
గణేశుడి గురించి వివరించే ముఖ్యమైన గ్రంథాలు గణేశ పురాణం, ముద్గల పురాణం, గణపతి అధర్వశీర్షం, బ్రహ్మ పురాణము, బ్రహ్మాండ పురాణం, ఇంకా మరో రెండు పౌరాణిక విజ్ఞాన శాస్త్రాలు ముఖ్యమైనవి.
వినాయకుడికి అనేక పేర్లున్నాయి. గణపతి, గణేశుడు, విఘ్నేశ్వరుడు, లంబోదరుడు మొదలైనవి. శ్రీ అనే గౌరవవాచకాన్ని ఈ పేర్ల ముందు వాడుతుంటారు.
గణం అంటే ఒక సమూహం. పతి లేదా ఈశ అంటే యజమాని, నాయకుడు అని అర్థం ఇక్కడ గణాలు అంటే గణేశుడి తండ్రియైన శివుడి సైన్యాలు. గణం అంటే సాధారణ అర్థంలో ఒక వర్గం, తరగతి, సంఘం లేదా సంస్థ అని కూడా భావించవచ్చు.
భారతదేశంలో వినాయకుడిని గణేశుడు, గణపతి, విఘ్నేశ్వరుడు, గణనాథుడు, పిల్లైయార్ వంటి అనేక నామాలతో అర్చిస్తారు. హిందూమతంలో పూజింపబడే అనేక దేవతామూర్తులలో దాదాపు అన్ని సంప్రదాయాలలోను, అన్ని ప్రాంతాలలోను బహుళంగా అర్చింపబడే దేవుడు వినాయకుడు. శైవం, వైష్ణవం, శాక్తేయం, జైనం, బౌద్ధంలలోను, భారతదేశం వెలుపల చీనా, నేపాల్, టిబెట్, జపాన్, ఇండొనీడియా వంటి దేశాలలోను కూడా వినాయకుడి అర్చన ఉంది.
వినాయకునికి అనేక నామములు, పేర్లు ఉన్నాయి. కాని అంతటా అత్యంత ప్రస్ఫుటంగా గుర్తింపబడే లక్షణాలు – ఏనుగు ముఖం, ఎలుక వాహనం అడ్డంకులు తొలగించే గుణం విద్యా, బుద్ధి ప్రదాత ధార్మిక, లౌకిక కార్యక్రమాల (వ్రతము, యజ్ఞము, పరీక్షలు వ్రాయడం, ఇల్లు కట్టడం వంటివి) ఆరంభంలో వినాయకుడిని స్తుతించే లేదా పూజించే ఆనవాయితీ సర్వసాధారణం
వైదిక కాలంనుండి, అంతకుముందు ఉన్న కొన్ని విశ్వాసాలు వినాయకుని సూచిస్తున్నప్పటికీ సా.శ. 4వ, 5వ శతాబ్దాలలో, ప్రత్యేకించి గుప్తుల కాలంలో వినాయకునికి ఇప్పుడు మనం పూజించే రూపం, లక్షణాలు, సంప్రదాయాలు ధార్మిక సమాజంలో రూపుదిద్దుకున్నట్లుగా అనిపిస్తుంది. తరువాత వినాయకుని పూజ చాలా వేగంగా ప్రాచుర్యం పొందింది. 9వ శతాబ్దంలో స్మార్తుల పంచాయతనంలో ఒక విభాగం అయ్యింది. వినాయకుడు అందరికంటే అత్యున్నతమైన భగవంతుడు (దేవదేవుడు) అని విశ్వసించే గాణపత్య సమాజం ఈ కాలంలో ఏర్పడింది. వినాయకుని గురించి తెలిపే ముఖ్యమైన ధార్మిక గ్రంథాలు – గణేశ పురాణము, ముద్గల పురాణము, గణపతి అథర్వశీర్షము.
