కొలకలూరి ఇనాక్ స్వరం
📖
( డా. ఎం. సుబ్బరాజు అనువాద కవిత)

అది నీతి నీరజాన్ని వికసింపజేసే స్వరం.
అది జీవన పునాది పటిష్టమయ్యే ప్రాయోగిక గళం.
అది హృదయతంతులను తాకే గుణగణాల రాగం.
అది మనుషుల్ని మార్గీకరించే జ్ఞాన దిక్సూచి.
అది సాహిత్య పరిమళాలను విరబూయించే కళా సృష్టి.
అది చీకట్లకు చెరువై వెలుగులు నింపే జీవ ప్రకాశం.
అది మానవత్వాన్ని హత్తుకునే నిస్వార్థ స్పర్శ.
అది ఆలోచనలకు నూతన మెరుపులు నింపే విజ్ఞా(న) జ్యోతి.
అది లోతైన పరిశీలనకు ఆహ్వానం పలికే మేధో దర్పణం.
అది ప్రశ్నలకూ సందేహాలకూ నిదర్శనమయ్యే జిజ్ఞాసా తపనగల సాధనం
అది పేదల గుండెల్లో కొత్త ఆశను నాటే మానవ బలగం.
అది సమాజపు కట్టుబాట్లను మార్చే సంస్కార పునర్నిర్మాణం.
అది తెలుగు సాహిత్య నభోవీధిలో మెరుస్తున్న తారాగణం.
అది నారీశక్తిని వెలికితీసే చైతన్య రూపాంతరం.
అది అణగారిన హృదయాలను నిలబెట్టే ఆత్మవిశ్వాస ధైర్యం.
అది సాహిత్య లోకంలో చిరకాలం నిలిచే సాంప్రదాయ ఘననీయం
అది పేదల పట్ల అపార మానవత్వాన్ని ప్రసరించే నిస్సీమ కరుణామయం
అందుకే — అదయ్యింది..
కొలకలూరి ఇనాక్ సాహిత్య స్వరూపం
అది భారత సాహిత్యానికే కాదు,
ప్రపంచ సాహిత్యానికీ
అజరామరం.
— కంచర్ల సుబ్బానాయుడు✒️
📖

