పుస్తకాల నిలయం గ్రంధాలయం

జ్ఞాన బండాగారం గ్రంథాలయం
పుస్తకాల నిలయం విజ్ఞాన సంపద
మనిషి వికాసానికి మూల స్తంభాలు
సమాచార కేంద్రం గ్రంధాలయం!!
బంగారు భవిష్యత్తుకు బాటలు
బాలల వినోదాల గ్రంథాలయం
తరతరాల విజ్ఞాన సంపద
మనిషిని మనీషిగా మార్చేది!!
సరస్వతి నిలయం గ్రంథాలయం
భవితకు బాట గ్రంథాలయం
అక్షరాల ఆలయ మది
పుస్తకాల పరిచయం అది!!
విలువలెన్నో నేర్పుతది
విజ్ఞానులను చేస్తది
పాఠకులకు జ్ఞాన సంపద
సమాజ వికాసానికి మూల స్తంభాలు!!
దేవులపల్లి రమేశ్,
సిద్దిపేట, నంగునూర్
చరవాణి 9963701294
