ఆంగ్ల నూతన సంవత్సరం

తెలుగు వారి సంవత్సరాది ఉగాది
ఆంగ్ల సంవత్సరాది జనవరి ఒకటవ తేది
జరుపుకుంటే తప్పేంటి ఆంగ్ల సంవత్సరాది
కొన్ని దశాబ్దాలు పైగా వస్తున్న ఆనవాయితది
తెల్లవాళ్ళ పాలనలో మగ్గిన మన దేశం
పుణికి పూచుకోదా వాళ్ళ సంప్రదాయం
అయినప్పుడు విశ్వమంతా ఒకటే గ్రామం
సంస్కృతులు కలవకపోవు ఆ మాత్రం
ప్రపంచమాచరిస్తున్నది ఆంగ్ల కాలమానం
ఆంగ్ల సంవత్సరాదికి పలకాల్సిందే స్వాగతం
జరుపుకోవాలి ఆ ఆనంద అంబర సంబరం
ముచ్చటగా ఆ వేడుక సకుటుంబ సపరివారం
ఆ ముసుగున పనికిరాదు విచ్చలవిడితనం
కూడదు మరచుట మన సంస్కృతి సంప్రదాయం
శుభాకాంక్షల మార్పిడికి లేదే నియంత్రణం
శుభం కోరడానికి ఉండదు దుర్ముహూర్తం
మహి మేలు కోరడమే ప్రతి పండుగ పరమార్ధం
దానికి ఉండదు కులమత ప్రాంతీయ బేధం
వేళ్లూనిన ఉగ్రవాద చిరునామా చెరిగిపోవాలని
మహిన మతసామరస్యం వెళ్లి విరియాలని
మానవత్వపు పల్లకిని ప్రజలు మోయాలని
ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ చిగురించాలని
పల్లెలు పాడిపంటలతో తులతూగాలని
ప్రేమానురాగాలు జాతిలో వెల్లివిరియాలని
కోరుకుందామందరం ఆంగ్ల సంవత్సరాదిని
— జె వి కుమార్ చేపూరి
