మరక మంచిదే!

మరక కూడా మనసులను
కలుపుతుంది!
మాపు నలుగురు కలయికకు
వారధి అవుతుంది!
ఒక పరిచయం ఒకరి అవసరం తీర్చి
ఇద్దరికి ఉపాధి ఐన వేళ!
ఇదిగో అంటూ కాలం చూపిన
గొప్ప అనుభవ సాక్ష్యం!
ఆ సమయం కొన్ని జ్ఞాపకాల
పరిమళాల పరవశం!
రేపటి మది నిధులుగా
దాచుకునే అవకాశం!
నాలుగు కోణాల తెల్ల పలక
మసి పూసుకుంది ఇందుకా!
బహుశా రాయిలో దైవం
కొలువుండే సత్యం!
వృత్తిని గౌరవించే దొడ్డ మనసు
శ్రమను సన్మానించే ఆ హృదయం!
ఈ కాలంలో ఆ తీరు సద్గుణం
అరుదుగా ఉండే మానవత్వం!!.
✍️ రాజు కల్లూరి
ధవళేశ్వరం
తూర్పు గోదావరి జిల్లా –
ఫోన్: 9110538811
