ప్రతి ఉదయమూ నూతనమే.
ప్రతి ఉదయమూ..నూతనమే
ప్రతి ఉషోదయమూ..
కొత్త సంవత్సరమే.
ప్రతి తొలి కిరణం..
నవోదయమే.
ప్రతి నిశీధి..
శోధనా భరితమే.
ప్రతి పున్నమి..
పునర్జన్మే.
ప్రతి అమవాశ్య..
అంపశయ్యే.
అనంత జీవన గమనంలో
ప్రతి రోజూ..
నూతన సంవత్సరమే.
ప్రతి ఉదయమూ
కొత్త.. జననమే..
నూతన.. జీవనమే..!
ప్రతి ..ఉషోదయమూ..
నిత్య నూతన ఆగమమే.
ప్రతి ..సూర్యాస్తమయం
నిర్భంధ.. నిష్క్రమణమే.
మంచి మనసుకు ప్రతి
రోజూ శుభంకరమే.
మంచి పనికి రోజంతా
సు- ముహూర్తమే.
పది మది మంచి కోరితే
క్షణ క్షణమూ..దేవుని దీవెనలే.
సద్బుద్దితో ప్రవర్తిస్తే
సర్వం.. సన్మార్గమే.
ప్రతి ఉదయమూ..వినూత్నమే
ప్రతి రోజూ..” న్యూ ఐయరే “.
ప్రతి ఇంటా పండుగే..
ప్రతి హృదయమూ దేవాలయమే.
— విజయకుమార్ గడియా
బెంగుళూరు.

