పర్యావరణం కాపాడుకుందాం.

మనం నివసించే పరిసరాలను
శుభ్రంగా ఉంచుకోవటం
మన కనీస బాధ్యత.
మన చేసే నిర్లక్షమే మన మంతా
రోగాల ఉబిలో కి చేరుకున్నాం…
అది గ్రహించి మసలుకోవాలి.
పర్యావరణ కాలుష్యాన్ని నివారించాలి.
మనం చేసే పనుల వలనే అన్నీ జరుగుతున్నాయి.
దాన్ని నివారించటం మన చేతుల్లోనే ఉంది.
మనం వాడే పరికరాల వలనే ఇదంతా జరుగుతోంది.
ఇంధనం వాడకాన్ని తగ్గించాలి.
కాలుష్యాన్ని కలిగించే వస్తువుల వాడకం తగ్గించాలి.
ముఖ్యంగా ప్లాస్టిక్స్ వాడకాన్ని తగ్గించాలి.
మీకు తెలుసా ?
ప్లాస్టిక్స్ భూమిలో
కొన్ని వేల
సంవత్సరాల వరకు విలీనం కావు…
మనం వదిలే కలుషిత గాలి వల్ల కూడా
ఎంతో కాలుష్యం జరుగుతోంది,
ఇదంతా కలగకుండా కాపాడాలి
అంటే మనం చెట్లను పెంచాలి.
మనం పీల్చే గాలి చెట్ల నుండి వస్తుంది.
అదే మనకి ప్రాణ వాయువు.
మనం అన్ని ప్రకృతి విరుద్ధం పరికరాలు
ఉపయోగిస్తూ మన వాతావరణాన్ని
కాలుష్యం చేస్తూ వస్తున్నాం.
దీని వల్ల రోజూ కొన్ని వందల
జీవరాశులు అంతరించిపోతున్నాయి.
అందుకు కారణం…
మనం అన్ని చోట్ల చెట్లు నరికేస్తూ..
పెద్దపెద్ద భవనాలు ,కర్మాగారాలు నిర్మిస్తూ
భూమి వేడెక్కటానికీ కారకులం అవుతున్నాం
భావి తరాలు ఆరోగ్యంగా ఉండాలని భావిస్తున్నారా
అయితే మనమంతా మన ఇంటి పరిసరాలలో
మొక్కలు నాటుకుందాం పర్యావరణం
కాపాడుకుందాం.
— సింహాద్రి శ్రీనివాస్ రావు
జయపురం
కోరాపుట్, ఒడిశా.
చరవాణి: 9861084340

