మొదలు

విశ్వానికి
కాలం కొలత ఏది?
ఏది ఆ తేదీ?
శూన్యానికి
దిక్కులు ఏవి?
ఏ సూర్యుడి ఉదయం?
ఏ సృష్టికి ఆరంభం?
అంతరిక్షపు ఏ అక్షానికి
ఏనాడు నిండిన ఏడాది?
నువ్వు నిర్ణయించిన
ఆనందపు క్షణం
ఏ గ్రహాంతరాలలో
అనుసరణం?
నీ కేరింత
ఏ పాలపుంతకి
మరింత వింత?
నీ సంబరం
అంటేది
ఎంత అంబరం?
కన్ను చూడలేని కదలికల మెలికల గుళికలు
తమ ఉనికికి ఆనిక
మొదలిక ఎక్కడ?
ఏ కాంతి నూతనం?
ఏ చీకటి పురాతనం?
విరజిమ్మే వెలుగులు
వీధి వరకేనా
విధి ని మార్చి గదికి
ప్రసారిస్తున్నాయా?
మనసున మరకలు
పై మెరుగుల మెరుపులు
కాలానికి దినాలా? జన్మదినాలా?
GVVSV ప్రసాద్ బాబు,
వాణిజ్య శాస్త్ర అధ్యాపకులు,
డా” వి. యస్. కృష్ణా డిగ్రీ కళాశాల (స్వ),
విశాఖపట్నం.
9492807312
