మానవులమైన మనం
ఏమిటీ కాకుల గోల అంటుంటాం …
వాటి గోలకు కూడా అర్థాలు ఉంటాయని అదికూడా ఒక భాషేనని తెలుసా? …..
మన మాటలు కూడా వాటికి
ఏమీటీ మానవుల గోల అనిపిస్తూ
ఆ గోలతోనే తెలియపరుస్తున్నాయేమో! ….
కాకుల అరుస్తున్నాయి అంటే
వాటిలో ఏ ఒకటైనా చనిపోయినా
లేదా అవి చూసిన ఆహారాన్ని
మిగతా వాటికి తెలియపరచడానికైనా లేదా విశ్రాంతి తిసుకుంటున్న సమయంలో
వాటిలో వాటితోనే ముచ్చట్లు మాట్లాడుకోవడమైనా ఇలా
ఏదైనా కారణం కావచ్చు …..
ఆ భాష మనకు తెలియనంత మాత్రాన కాకి గోల అని వాటిని చిన్న బుచ్చడం సబబు కాదు …. కాకులు తోటి జీవులు, మరియు కాలజ్ఞానులు … పర్యావరణ పరిరక్షకులు, పారిశుధ్య కార్మికులు..
భగవంతుని ప్రసాదితాలు …..
కాకుల గోలని వాటిని చిన్నబుచ్చుతున్నామంటే సృష్టికర్తనే చిన్నబుచ్చడమని తెలుసుకోండి ….
దారానా
(దాశరెడ్డి రామక్రిష్ణ నాయుడు)
శ్రీకాకుళం

